కేజ్రీవాల్‌ ధర్నాపై పిటిషన్‌ : సత్వర విచారణకు సుప్రీం నో | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ ధర్నాపై పిటిషన్‌ : సత్వర విచారణకు సుప్రీం నో

Published Tue, Jun 19 2018 11:49 AM

SC Refused Urgent Hearing Seeking Action Against Delhi CM Arvind Kejriwal  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ధర్నాకు దిగిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు నిర్ణయం ఆయనకు ఊరట ఇచ్చింది. ఎల్జీ కార్యాలయంలో ధర్నాకు దిగిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై చర్యలు చేపట్టాలని న్యాయవాది శశాంక్‌ దేవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సత్వర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

కాగా వేరొకరి ఇల్లు, కార్యాలయాల్లో ధర్నాలు చేయడం ఏంటని సోమవారం ఢిల్లీ హైకోర్టు సీఎం కేజ్రీవాల్‌ సహా ఆయన మంత్రివర్గ సహచరులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎల్జీ కార్యాలయంలో సీఎం బృందం చేపట్టిన ధర్నా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని పట్టుబడుతూ గత కొద్దిరోజులుగా ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్‌ సహా పలువురు మంత్రులు ధర్నా చేపట్టారు. ఆప్‌ శ్రేణులు సైతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సీఎం, మంత్రులకు మద్దతుగా నిరసన బాట పట్టాయి. 
 

Advertisement
Advertisement